నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసి?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఏకంగా క్షణకాల సుఖం కోసం చేయకూడని నీచమైన పనులు అన్ని చేసేస్తూ ఉన్నాడు మనిషి. చివరికి ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి. అక్రమ సంబంధాలకు తెర లేపుతూ  చివరికి వావి వరసలు మరిచిపోతున్నాడు మనిషి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.

 ఓ వ్యక్తి చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చాడు. దీనికి కారణం ఏకంగా అతని తమ్ముడు అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే. నేరం కింద సదర వ్యక్తి జైలుకు వెళ్ళగా ఇక భార్య అతని తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఈ విషయం తెలుసుకోవడంతో.. కోపంతో ఊగిపోయి చివరికి చిన్నారి ఉసురు పోసుకున్నాడు. ఈ ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల విజయ్ సుహాని చైన్స్ స్నాచింగ్ కేసులో గురుగ్రాంలోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలోనే విజయ్ భార్య అతని తమ్ముడినే పెళ్లి చేసుకుని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. కట్ చేస్తే ఇటీవల విజయ్ జైలు నుంచి విడుదలయ్యాడు.

 నేరుగా ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూశాక అతనికి దిమ్మతిరికే నిజం తెలిసింది  తన భార్య సొంత తమ్ముడు నే పెళ్లి చేసుకుందని.. అతనితో ఒక పాపని కనింది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ విషయంపై భార్యతో గొడవపడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి నేలకేసి కొట్టి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అయితే బాలిక అపస్మారక  స్థితిలో ఉండటం చూసి తల్లి కన్నీరు మున్నిరయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత తల్లి  పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: