తెలంగాణ: లోక్‌సభ నామినేషన్లలో సిత్రాలు ఎన్నో?

Chakravarthi Kalyan
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 మంది నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో సగానికి పైగా నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మల్కాజిగిరిలో 114 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 77 తిరస్కరించి 37 ఆమోదించింది. మెదక్ లో కేవలం ఒక నామినేషన్ మాత్రమే చెల్లుబాటు కాలేదు. అక్కడ 53 ఆమోదించారు.

ఆదిలాబాద్ లో 10, పెద్దపల్లిలో 14, కరీంనగర్ లో 20 నామినేషన్లను తిరస్కరించారు. నిజామాబాద్ లో 10, జహీరాబాద్ లో 14 నామినేషన్లను తిరస్కరించారు. సికింద్రాబాద్ లో 11, హైదరాబాద్ లో 19 నామినేషన్లను తిరస్కరించారు. చేవెళ్లలో 18, మహబూబ్ నగర్ లో ఏడు నామినేషన్లను తిరస్కరించారు. నాగర్ కర్నూలులో 13, నల్గొండలో 25, భువనగిరిలో పది, మహబూబాబాద్ లో ఐదు నామినేషన్లను తిరస్కరించారు. ఖమ్మంలో నాలుగు, వరంగల్ లో పది నామినేషన్లను తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.

పరిశీలన అనంతరం ఆదిలాబాద్ లో 13, పెద్దపల్లిలో 49 నామినేషన్లు ఆమోదించారు. కరీంనగర్ లో 33, నిజామాబాద్ లో 32, జహీరాబాద్ లో 26 నామినేషన్లు ఆమోదించారు. సికింద్రాబాద్ లో 46, హైదరాబాద్ లో 38, చేవెళ్లలో 46 నామినేషన్లు ఆమోదించారు. మహబూబ్ నగర్ లో 35, నాగర్ కర్నూలులో 21, నల్గొండలో 31, భువనగిరిలో 51 నామినేషన్లు ఆమోదించారు.

ఇక వరంగల్ లో 48, మహబూబాబాద్ లో 25, ఖమ్మంలో 41 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈసీ వెల్లడించనుంది. ఇక ఉపసంహరణ తర్వాతే అసలు లెక్కలు తేలతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: