రేవంత్‌రెడ్డి, హరీష్‌రావు మ్యాచ్‌ ఫిక్సింగ్.. ఇదిగో రుజువు?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడిందని బీజేపీ శాసన సభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. తాము మొదటి నుంచి రుణమాఫీతో పాటు 400పైగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని..అసెంబ్లీ వేదికగా కూడా ఇదే విషయమై ఎల్పీ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఒక్క రుణమాఫీనే కాదు, మిగతా హామీలకు కూడా ఆగస్టు 15 డెడ్ లైన పెడుతున్నారా.. సమాధానం చెప్పకుండా...సబ్జెక్ట్ పక్కదారి పట్టించేలా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అందుకే హరీష్ రావు మిగతా హామీలను పక్కన పెట్టి కేవలం రుణమాఫీపైనే ప్రశ్నిస్తూ రాజీనామా లేఖ డ్రామా ఆడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
హరీష్‌కు, రేవంత్ రెడ్డికి మిగతా హామీలు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ,ఎస్టీ బీసీలకు ఇచ్చిన హామీలు ఏమి గుర్తుకు రావడం లేదా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆగస్టు 15న రుణమాఫీ ఒక్కటే కాదు ..అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: