రేవంత్‌ రెడ్డి.. కావాలనే ఆ కులం వాళ్లను తొక్కేస్తున్నారా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని బీసీ సంఘాల నేతలు అంటున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనసభ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో "స్థానిక సంస్థలు - రిజర్వేషన్లు" అనే అంశం"పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరగనున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఇప్పట్నుంచే బీసీలంతా ఐఖ్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయా సంఘాల నేతలు సూచించారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్న దృష్ట్యా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు.
అదే జనరల్ స్థానాల్లో 7 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించుకోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం... కుల గణన చేపట్టడం ద్వారా దామాషా ఆధారంగా న్యాయం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. జూన్‌లో స్థానిక సంస్థలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని బీసీ జనసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: