జగన్‌ది మేనిఫెస్టో కాదు.. రాజీనామా లేఖ?

Chakravarthi Kalyan
వైసీపీ అధినేత జగన్‌ ని‌న్న ప్రకటించిన మేనిఫెస్టోపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. జగన్‌ది మేనిఫెస్టో కాదు.. రాజీనామా లేఖ    అంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ అయిదేళ్లలో ఫించన్ 500 పెంచుతానని మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనమని నారా లోకేష్ కామెంట్ చేశారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్లు  మ్యానిఫెస్టో స్పష్టం చేస్తోందన్న నారా లోకేష్.. కూటమి ప్రభుత్వo అధికారంలోకి వచ్చిన వెంటనే 3వేల పెన్షన్ ను 4వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు.

పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత నాదేనని నారా లోకేష్ అంటున్నారు.  ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే చేస్తారని నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని నారా లోకేష్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: