జగన్‌పై చంద్రబాబుకు ప్రేమ తగ్గిందా.. అప్పుడే యూ టర్న్..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం చంద్రబాబును యూ టర్న్ బాబు అంటూ వైసీపీ నేతలు కొత్త పేరు పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన యూటర్న్ తీసుకుంటున్నారనేది వారి ఆరోపణ. ప్రత్యేక హోదా అంశం మొదలుకుని.. బీజేపీతో దోస్తీ వంటి అనేక అంశాల్లో చంద్రబాబు పదే పదే యూటర్న్ తీసుకున్నారని వారు ఆరోపిస్తుంటారు.



కాకపోతే ఇలా యూటర్న్ తీసుకునేందుకు ఆయన కొంత సమయం తీసుకుంటారు. కానీ చంద్రబాబు ఈసారి యూటర్న్ తీసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. ఢిల్లీ ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఆయన జగన్ మద్దతు ఇచ్చినా తీసుకుంటామని కూటమిలోకి ఆహ్వానిస్తామని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.



చంద్రబాబు జగన్‌కు స్నేహ హస్తం చాచడం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా స్పందన వచ్చింది. మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ పై ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా జగన్ తమకు మద్దతివ్వాలని కోరడం సంచలనంగా మారిందిఇది కాస్తా అసలుకే ఎసరు తెస్తుందని గమనించిన చంద్రబాబు ఒక్క రోజులోనే మాట మార్చేశారు.



రాష్ట్రపతిని కలసి వినతపత్రం ఇచ్చిన సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ తాము జగన్ మద్దతు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదేంటి నిన్నే మీరు మద్దతు ఇస్తే తీసుకుంటామన్నారుగా అని మాట్లాడితే.. మీడియాపై మండిపడ్డారు. మీరు తప్పు అర్థం చేసుకున్నారంటూ మీడియాకే క్లాస్ పీకారు. జగన్ లాంటి అవినీతి పరులు మద్దతు ఇస్తే మాత్రం మేం తీసుకుంటామా అంటూ ప్లేటు ఫిరాయించేశారు. పాపం ఒక్కరోజులోనే జగన్ పై చంద్రబాబుకు ప్రేమ తగ్గిపోయిందేమో అంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: