గౌరు చరితా రెడ్డి వర్సెస్ రాంభూపాల్ రెడ్డి.. పాణ్యం గడ్డపై విజేత ఎవరంటే?

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గాలలో పాణ్యం ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గౌరు చరితా రెడ్డి వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పాణ్యంలో ఎమ్మెల్యే కుర్చీ ఎవరి సొంతమవుతుందనే చర్చకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం.
 
గౌరు చరితా రెడ్డి 2004 సంవత్సరంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా 2014 సంవత్సరంలో పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో పోటాపోటీ ఉండనుందని సమాచారం అందుతోంది. రాం భూపాల్ రెడ్డి గత ఐదేళ్ల పాలన పరవాలేదనే స్థాయిలో ఉందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది.
 
వృద్ధులు మాత్రం వైసీపీకే ఓటేస్తామని చెబుతుండటం గమనార్హం. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు బాగానే అందాయని వృద్ధులు చెబుతున్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉందని రోడ్ల మరమ్మత్తు పనులు చేయిస్తే బాగుంటుందని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఒకే రాజధాని ఉంటే బాగుంటుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
 
ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకే ఎడ్జ్ ఉండగా ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. పాణ్యంకు సరైన బస్టాండ్ లేదని బస్టాండ్ దగ్గర సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానికులు చెబుతున్నారు. ఏపీ నేతలందరూ మోదీకి మద్దతు పలుకుతున్నారని ఇక్కడి ఓటర్లు కామెంట్లు చేస్తున్నారు. పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి, చరిత పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాలి. నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని సంక్షేమ పథకాలు మాత్రం బాగానే అందాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కర్నూలుకు హైకోర్టు వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: