జగన్ కు పోసాని వెన్నుపోటు...ఇక దేవుడు కూడా కాపాడలేడు..ప్రమాదంలో కెరీర్?
ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి, రాజకీయాలు మాట్లాడనంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా అతనిపై ఏపీవ్యాప్తంగా కూటమి నేతలు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా, పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. బెదిరింపులు, కేసులు తనకు కొత్త కాదంటూ వెల్లడించాడు.
ఎన్నో సంవత్సరాల కిందటే చంపేస్తామంటూ, కేసులు పెడతామని ఎంతోమంది బెదిరించారంటూ పోసాని అన్నారు. వాటన్నింటికీ నేను భయపడే వాడినైతే రాజకీయాలకు దూరంగా ఉండే వాడినని అన్నారు. నిజంగా తాను బూతులు మాట్లాడి, వ్యక్తిగత విమర్శలు చేసే వాడినని భావిస్తే నారా లోకేష్ తనకు ఎందుకు టిడిపిలోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించాడు పోసాని కృష్ణమురళి. ఎన్నికల ఫలితాలు రాకముందే లోకేష్ తనకు ఆఫర్ ఇచ్చాడని, మంచి పదవి ఇస్తామని అన్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో పోసానిపై సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
రాంగ్ టైమ్ లో రాంగ్ స్టేట్మెంట్ పోసాని కృష్ణ మురళి ఇచ్చారు. మొన్నటి వరకు వైసిపికి మద్దతుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి... తన కెరీర్ ప్రమాదంలో వేసుకున్నాడు పోసాని అని అందరూ అంటున్నారు. దీంతో పోసాని కృష్ణ మురళిపై అందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.