రైతులు... పెన్షనర్లను నిరాశపరచిన వైసీపీ మేనిఫెస్టో..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలు అయ్యి చాలా రోజులే అవుతుంది. ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది . చాలా రోజుల నుండి ప్రస్తుతం కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న మూడు పార్టీలు అయినటు వంటి తెలుగు దేశం , జనసేన , బీ జే పీ లు మేము అధికారం లోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెబుతూ వస్తున్నారు . ఇలా కూటమి సభ్యులు చెబుతూ వస్తూ ఉండటంతో వారి మేనిఫెస్టో పై జనాలకు ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ జనాలకు ఈ సారి ఎలాంటి కొత్త పథకాలను తీసుకురానుంది. ఉన్న పథకాల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూపించానుంది అనే విషయాలను తెలుసుకోవడానికి జనాలు చాలా రోజులుగా తహతలాడుతున్నారు. ఎట్టకేలకు వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక అందులో కొన్ని విషయాలలో జగన్ ప్రభుత్వం చాలా మెరుగ్గా ఆలోచించగా , మరికొన్ని విషయాలలో మాత్రం వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది. కాకపోతే మరికొందరు మాత్రం ఆచరణ సాధ్యం కానివి చెప్పడం కంటే ఆచరణ సాధ్యం అయ్యేవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెబుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే... వైయస్సార్ రైతు భరోసాను 13500 నుండి 16 వేలకు పెంచారు.  కౌలు రైతులకు కూడా ఈ భరోసా వర్తిస్తుంది అని జగన్ హామీ ఇచ్చారు. ఇక రెండు విడతల్లో పెన్షన్ ను 3500 వరకు పెంచుతాము అని జగన్ మేనిఫెస్టోలో భాగంగా సూచించారు. ఇక ఈ రెండు విషయాల్లో వైసీపీ చాలా వెనుకబడిపోయింది అని రైతులకు , పెన్షనర్ల విషయంలో పెద్ద స్థాయిలో వైసీపీ పార్టీ ఆలోచించలేదు అని భిన్న అభిప్రాయాలు తాజాగా ఈ పార్టీ విడుదల చేసిన మానిఫెస్టో పై వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: