జగన్ హయాంలో కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్... ఇదంతా ఎలా జరిగిందో తెలుసా..?

Pulgam Srinivas
గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రజలందరికీ ఓ భావన ఉంటుంది . పిల్లలు కూర్చోవడానికి బెంచీలు లేకపోవడం, కనీసం బ్లాక్ బోటు పై రాయడానికి సుద్ద ముక్కలు కూడా లేని పరిస్థితుల్లో ఎన్నో స్కూల్స్ ఉండేవి. ఇక మరుగు దొడ్ల విషయం చెప్పనక్కరలేదు. ఆడపిల్లలకు సైతం మరుగుదొడ్లు లేని ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఉండేవి . కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ వచ్చాక మారిపోయాయి.

ఒక వ్యక్తి ఎదుగుదల, మార్పు అనేది స్కూల్స్ నుండే మొదలు అవుతుంది. అక్కడ ఆ వ్యక్తికి మంచి విద్య, భోజనం ఇచ్చినట్లు అయితే అతను జీవితంలో ఒక గొప్ప స్థానానికి ఎదుగుతాడు అని నమ్మిన జగన్ "నాడు నేడు" అనే కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్నో స్కూళ్లను ఆధునికరించాడు. దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అయినా కానీ వెనకాడకుండా స్కూల్ అన్నింటిని బాగు చేయించాడు.

జగన్ రాకముందు బ్లాక్ బోర్డ్ పై పాఠాలు విన్న విద్యార్థులు ప్రస్తుతం డిజిటల్ స్క్రీనింగ్ లో పాటలు వింటున్నారు. అప్పటివరకు మరుగుదొడ్డి ఉంటే చాలు అనుకున్న పిల్లలు ఇప్పుడు అత్యాధునిక వసతులతో కూడిన విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని చెప్పడానికి పిల్లలు, చదివిపిస్తున్నాం అనడానికి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఆ పరిస్థితిని తొలగించి గర్వంగా మేము గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటున్నాం అని చెప్పే విధంగా వాటి రూపురేఖల్ని జగన్ మార్చాడు.

అలాగే చదువు మాత్రం ఇస్తే సరిపోదు మంచి భోజనం కూడా ఉండాలి అని వారికి ఎంతో మెరుగైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా స్కూల్స్ లోనే అందిస్తున్నాడు. అలాగే వారికి పుస్తకాలు, బట్టలు, బ్యాగులు చదువుకోవడానికి కావలసిన మరిన్ని వసతులను కూడా జగన్ కల్పిస్తున్నాడు. వీటన్నింటితో ప్రభుత్వ పాఠశాలలను, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జగన్ మార్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: