'వారణాసి’ కంటే ముందే థియేటర్స్ లోకి రాబోతున్న జక్కన్న తలరాత మార్చేసిన ఐకానిక్ సినిమా!

Thota Jaya Madhuri
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా “వారణాసి” పేరుతో తెరకెక్కుతుండగా, ప్రాజెక్ట్ ప్రస్తుతం అనుకున్న ప్లాన్ ప్రకారమే సాఫీగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా, ఈ ఏడాది రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాలు “బాహుబలి: ది బిగినింగ్” మరియు “బాహుబలి: ది కన్క్లూజన్” ను కలిపి “బాహుబలి ది ఎపిక్” పేరుతో థియేటర్లలో తిరిగి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రీ రిలీజ్ కూడా అభిమానుల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది. ముఖ్యంగా పెద్ద తెరపై మరోసారి బాహుబలి మహిమను చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇది ఒక పండుగలా మారింది. ఇప్పుడు అదే తరహాలో, వచ్చే ఏడాది మరో ఐకానిక్ సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నట్లు “వారణాసి” టీమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.



రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన దర్శకత్వంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన విజువల్ వండర్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, టెక్నికల్ పరంగా ఆయన అత్యంత కష్టపడి, కొత్త ఆలోచనలతో తెరకెక్కించిన సినిమా మాత్రం “ఈగ” అని చెప్పుకోవచ్చు. నాచురల్ స్టార్ నాని, సమంత, అలాగే విలన్ పాత్రలో సుదీప్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఈగను కథానాయకుడిగా మార్చి, ప్రతీకార కథను ఆసక్తికరంగా చెప్పిన విధానం రాజమౌళి ప్రతిభకు మరో ఉదాహరణగా నిలిచింది.విడుదల సమయంలో “ఈగ” సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథనం అన్నీ కలిపి ఈ సినిమా ఒక ప్రత్యేకమైన క్లాసిక్‌గా నిలిచిపోయింది.



ఇప్పుడు ఈ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు “వారణాసి” టీమ్ నుంచి అధికారికంగా ట్వీట్ విడుదలైంది. “ఈగ” సినిమా 2026లో రీరిలీజ్ కానున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు అందనున్నాయని సమాచారం.మొత్తానికి, రాజమౌళి క్లాసిక్ సినిమాలు మరోసారి పెద్ద తెరపై చూడబోతున్న అవకాశం రావడం సినీ ప్రేమికులకు నిజంగా ఒక శుభవార్త అనే చెప్పాలి. ఇక “ఈగ” రీరిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: