2025 @ షర్మిల పొలిటికల్‌గా హిట్టా... ఫట్టా... ?
సీనియర్ల అనుభవాన్ని పక్కనపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ( జూనియర్లను ) ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వస్తున్నాయి. దీనివల్ల క్యాడర్‌లో ఐక్యత లోపించి, పార్టీ బలోపేతం కావడం కష్టంగా మారింది. మహిళా నాయకురాలిగా షర్మిల మహిళా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని భావించినా, అది వాస్తవ రూపం దాల్చలేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఏపీలో, మహిళలను కాంగ్రెస్ వైపు ఆకర్షించే బలమైన నినాదాన్ని ఆమె వినిపించలేకపోయారు ..
వైఎస్ఆర్ కుమార్తెగా ఆయన ఇమేజ్‌ను వాడుకుంటున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో జగన్ లేదా చంద్రబాబు వంటి నాయకులను కాదని మహిళలు ఆమె వైపు మొగ్గు చూపే పరిస్థితి 2025లోనూ పెద్దగా కనిపించడం లేదు. షర్మిలపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేయడం .. విజయవాడలో నివాసం ఉంటానని, అక్కడ పాలు పొంగిస్తానని చెప్పిన ఆమె, ఇప్పటికీ తన మకాంను పూర్తిస్థాయిలో ఏపీకి మార్చలేదు ..
కేవలం ప్రెస్ మీట్లు, కీలక పర్యటనల కోసం మాత్రమే ఏపీకి వచ్చి, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతుండటం వల్ల స్థానిక కార్యకర్తల్లో నమ్మకం కలగడం లేదు. రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటేనే నాయకత్వం బలపడుతుందనే సూత్రాన్ని ఆమె విస్మరించినట్లు కనిపిస్తోంది ..