2025 @ టీడీపీలో బెస్ట్ లీడర్స్ వీళ్లే... !
వెనిగండ్ల రాము గుడివాడలో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడంలోనూ, నియోజకవర్గంలో పార్టీ పట్టును పెంచడంలోనూ సఫలమయ్యారు. వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్లలో మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజల సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వడంలో ముందున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి కూడా ప్రజలకు చేరువ కావడంలో ముందున్నారు. ముఖ్యంగా నగరం ఎదుర్కొంటున్న డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. రాజమండ్రి సిటీ - రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ అనుభవంతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన గ్రౌండ్ లెవల్‌లో బలమైన పట్టును ప్రదర్శిస్తున్నారు.
విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు నిరంతరం ప్రజల్లో ఉంటూ పట్టును మరింత పెంచుకుంటున్నారు. 2025 ద్వితీయార్థంలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడటానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ నిరంతరం చేస్తున్న సమీక్షలే కారణమని చెప్పాలి. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో "ప్రజల వద్దకు పాలన" తీసుకెళ్లాలనే నిబంధనను కఠినంగా అమలు చేయడంతో, గతంలో స్తబ్దుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఫైనల్‌గా 2025లో టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం అధికారానికే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ జోష్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.