హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఆపరేషన్ సింధూర్.. రియల్ హీరోస్ వీళ్లే..?

Divya
ఏప్రిల్ 22వ తేదీన జరిగిన సంఘటన ప్రతి భారతీయులకు గుర్తు ఉంటుంది. ఆ రోజున జమ్మూకాశ్మీర్ లోని ఫహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు బయసరన్  లోయలోకి ప్రవేశించి పర్యటకులను మతం అడిగిమరీ కాల్పులు జరగడం సంచలనంగా మారింది.ఈ దాడిలో 26 మంది మరణించారు. అయితే ఈ ఫహల్గాం దాడికి ప్రతీగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. పాకిస్తాన్లో ఉండే 9 ఉగ్ర స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ కి ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ ఫోర్స్ కు చెందిన వింగ్ కమాండర్ వ్యామికా  సింగ్ విజయవంతంగా దాడులను నిర్వహించారు. వీరిద్దరే ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించారు.2025 లో ఈ మహిళలలే అందరి దృష్టి ఆకర్షించారు.


ఎవరి కర్నూల్ సోఫియా ఖురేషి అంటే:
గుజరాత్ ప్రాంతానికి చెందిన సోఫియా బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఐరాసకు చెందిన పిస్ మిషన్ లో భాగంగా  2006లో కాంగోలో  విధులు నిర్వహించారు. అనంతరం 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట ఇండియన్ ఆర్మీకి చెందిన బృందానికి ఈమె న్యాయకత్వం ఒక చరిత్రను సృష్టించారు. ఇందులో 18 దేశాలు పాల్గొన్నాయి అన్ని దేశాలు ఉన్నప్పటికీ కేవలం ఒక భారత్ బృందానికి మాత్రమే మహిళా న్యాయకత్వం వహించడం హైలెట్గా నిలిచింది.1990లో సోఫియా సైన్యంలో చేరారు ఆర్మీ సిగ్నల్ కోర్ కు చెందిన ఆఫీసర్గా పనిచేశారు. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఎక్కడ కూడా ఆమె రాజీలేని వైఖరిని ప్రదర్శించారు.


వ్యామికా సింగ్:
చిన్నప్పుడే పైలట్ కావాలని కలలు కన్న ఈమె చదువుకునే రోజులలో NCC లో చేరారు. ఇంజనీరింగ్ విత్తన పూర్తి చేసి ఆమె తన కలలు తగ్గట్టుగా భారత వైమానిక దళంలో పైలెట్ గా జీవితాన్ని మొదలుపెట్టింది. డిసెంబర్ 18, 2019 ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదాని అందుకుంది. ఆమె తన కుటుంబం నుంచి మొట్టమొదట భద్రత బలాగాలలో చేరిన తొలి మహిళగా పేరు సంపాదించింది. ఈమె జమ్మూ కాశ్మీర్లో ఈశాన్యం భారతంలో ఎత్తైన ప్రాంతాలలో కూడా అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాలలో కూడా హెలికాప్టర్ ని నడిపారు. ఎన్నో రెస్కు ఆపరేషన్లు కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్ లో జరిగిన అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకుంటే దాడి ఎంత పక్కాగా చేసిందో అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ యుహాత్మకంగాను విజయం చేయడం కోసమే చాలా కృషి చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: