రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా జ‌గ‌న్‌కే... బాబు సీఎం క‌ల‌లోనే..?

Suma Kallamadi
మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారని ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సామాజిక వర్గాలపరంగా తమకు ఎలా ఓట్లు పడతాయో లెక్కలు వేసుకుంటోంది. అయితే వైసీపీకే అన్ని సామాజిక వర్గాల ఓట్లు గంప‌గుత్త‌గా పడతాయని స్పష్టంగా తెలుస్తోంది. మొదటగా రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు వైసీపీకే పడిపోతాయి. ఎస్సీ 90%, ఎస్టీ కూడా 90% ఓట్లు కూడా జగన్ ఖాతాలోనే పడిపోయే అవకాశం ఉంది.
బీజేపీతో కలవడం టీడీపీకి చాలా పెద్ద మైనస్ అయిపోయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలతో సహా మైనారిటీల రిజర్వేషన్లను తీసేస్తామని  చెబుతోంది. అందుకే వెనుకబడిన మైనారిటీ కులాలు బిజెపి పార్టీ ఓట్లు వేయకూడదని బలంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సామాజిక వర్గాల వారందరూ వన్ సైడ్ అయిపోయారు. ఆ కారణం చేత ఈ ఓటర్లను టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది. బీసీల్లో కూడా చాలామంది జగన్‌కి ఓటేసే అవకాశం ఉంది. 2019లో కంటే ఈసారి ఎక్కువగా బీసీల ఓట్లు పడవచ్చు.
రియాలిటీ చెక్ చేసుకుంటే రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా జ‌గ‌న్‌కే వస్తాయి. చంద్రబాబునాయుడు మాత్రం అన్ని సామాజిక వర్గాల ఓట్లు తనకే ఎక్కువగా పడతాయని కాకి లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతానని అనుకుంటున్నారు కానీ అది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోలేకపోతున్నారు.  
బీజేపీ పొత్తు వద్దు అని, పవన్ కళ్యాణ్ తో కూడా దోస్తీ అవసరం లేదని చాలామంది టీడీపీ తమ్ముళ్లు భావించారు. నారా లోకేష్ కూడా ఈ పొత్తులను వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని తెచ్చి పెట్టుకున్నారు. బీజేపీతో చాలా పెద్ద మైనస్ అవుతుందని తెలిసి కూడా అనవసరంగా కలిశారు. పవన్ కళ్యాణ్ తనకు పెద్ద ప్లేస్ అని చంద్రబాబు అనుకుంటున్నారు కానీ ఆయన కూడా టీడీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెరసి చంద్రబాబు కలలో సీఎం అవుతారు కానీ నిజంగా కావడం దాదాపు అసాధ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: