ఇంగ్లీష్ మీడియంతో జగన్ తప్పు చేశారా.. విమర్శించే వాళ్లకు సరైన జవాబు ఇదే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మారింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ లో ఎవరైతే అనర్ఘళంగా మాట్లాడతారో వాళ్లు మాత్రమే సులభంగా ఉద్యోగాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల గొప్ప చదువులు చదివినా చిన్నచిన్న ఉద్యోగాలకే చాలామంది పరిమితమయ్యారు.
 
అయితే ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ సర్కార్ నుంచి ప్రకటన వెలువడిన సమయంలో క్షేత్ర స్థాయిలో జగన్ పై ఒకింత నెగిటివ్ ప్రచారం వినిపించడంతో పాటు ఎన్నో నెగిటివ్ కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. పేదలు, నిరుపేదలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని అనుకుంటున్నారు. జగన్ రూపంలో ఎంతోమంది పేదల కల నిజం కాబోతుంది.
 
ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరో బెండపూడి పిల్లల ద్వారా ఇప్పటికే ప్రూవ్ అయింది. జగన్ ప్లాన్స్ వేరని, ప్లానింగ్స్ వేరని జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎంతో ముందుచూపు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో అభివృద్ధి జరగలేదనే విమర్శలకు సైతం జగన్ తనదైన శైలిలో జవాబిచ్చారు.
 
జగన్ మరో ఐదేళ్లు సీఎంగా కొనసాగితే ఏపీ ప్రజల భవిత బంగారం కానుందని విద్యార్థుల జీవితాలు మారిపోనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ నాడు నేడుతో ఏపీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేశారనే సంగతి తెలిసిందే. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో సైతం వైసీపీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఆ పార్టీకి వరం కానున్నాయని తెలుస్తోంది. తన పాలన గురించి విమర్శలు చేసేవాళ్లకు జగన్ ఈ ఎన్నికల ఫలితాలతో ఒకింత గట్టిగా సమాధానం చెప్పనున్నారని సమాచారం అందుతోంది. ఏపీలో జగన్ వేవ్ మొదలైందని జగన్ మళ్లీ సాధించే సంచలనాలు చూడబోతున్నామని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: