విజయ్ దేవరకొండ మూవీకి అదిరిపోయే టైటిల్..!?

Anilkumar
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈమధ్య ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాలేకపోయినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టార్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్గా నిర్మించారు. అయితే థియేటర్స్ లో ఈ సినిమాకి మిక్స్డ్  టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ నిరాశపరిచాయి. ఇక ఓటిటిలో మాత్రం ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ

 సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..  అప్పటినుండే విజయ దేవరకొండ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక బిగ్గెస్ట్ పిరియాడికల్ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లో 14వ సినిమాగా రాబోతోంది. అయితే ఈ సినిమాని 1854 నుండి 1894 మధ్య జరిగే చారిత్రాత్మక కధ ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇకపోతే విజయ్

 దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి "రణబాలి" అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు ఈ సినిమాతో అయినా బిగ్గెస్ట్ ఫిట్ అందుకుంటాడో లేదో అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: