మోడీ చేస్తున్న అప్పులు చూస్తే.. జగన్‌ బెస్ట్ అనిపిస్తోందిగా?

గతంలో జగన్ మోహన్ రెడ్డి అప్పులు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించారు. అప్పులు లేకుండా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ , జనసేన, బీజేపీ నేతలు ఓ రేంజ్ లో విమర్శించారు.  ఇదే విషయాన్ని తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా పదే పదే చెప్పించారు.

ఇప్పుడు సీన్ కట్.. చేస్తే ఏపీలో అధికారం మారింది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో జగన్ అప్పులు చేశారని విమర్శించిన టీడీపీ ఈ యాభై రోజుల్లోనే పింఛన్లు, ఇతర అవసరాల కోసమని రూ.12 వేల కోట్లను ఖర్చు చేసింది. ఇందులో అప్పులు వాటా రూ.5 వేల కోట్లకు పైగా ఉండగా.. మరి రూ.7 వేల కోట్లకు అనుమతులు పొందింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వాలే అప్పులు చేస్తాయా.. కేంద్రం చేయదా అంటే కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 మార్చి 31 నాటికి దేశం అప్పు రూ.1,68,72,554 కోట్లుగా ఉంది. అయితే అప్పటికీ భారత దేశ జనాభా 142 కోట్లు అనుకుంటే.. ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.1.18 లక్షల అప్పును కేంద్రం మోపిందని అంచనా.

ఇది 2024 మార్చి 31 నాటికి ఉన్న దేశ అప్పు రూ.1,68,72,554 కోట్లు ఉండగా.. ఇది వచ్చే ఏడాది నాటికి రూ.1,81,68,456 కోట్లకు చేరనుంది. అంటే దగ్గర దగ్గరగా ఈ  ఏడాది రూ.13 లక్షల కోట్లను అప్పుగా తీసుకుంటాం అని కేంద్రం చెప్పకనే చెప్పినట్లయింది. అంటే అప్పులు చేయడం, వాటిని తీర్చడం అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్. అప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది. శక్తికి మించి అప్పులు చేసి.. కట్టకపోతే అప్పులు సంక్షోభం తలెత్తినట్లు లెక్క. కానీ నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వాలు అప్పు ఇచ్చే విషయంలో ఆయా రాష్ట్రాల సామర్థ్యాలకు అనుగుణంగానే ఇస్తుందనే విషయాలను మర్చిపోతున్నారు. కానీ జగన్ పై మాత్రం అప్పులను ప్రచారానికి వాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: