పిన్నెల్లి తగ్గట్లేదుగా...ఏపీ పోలీసులకే ఝలక్ ఇచ్చాడుగా !

Veldandi Saikiran

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మాచర్ల నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం బాక్స్లను స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టడంపై వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇరుకునపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.
దీంతో హైదరాబాద్ మహానగరంలో దాక్కున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగేసారు. ఏ క్షణమైన ఆయనను ఏపీ పోలీసులు పట్టుకునే ఛాన్స్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో... ఏపీ పోలీసులకు ఝలక్ ఇచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా తన కేసు ఉన్న నేపథ్యంలో... ఏపీ హైకోర్టు మెట్లెక్కారు. ఏపీ హైకోర్టు ను ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
తన తరఫు లాయర్ ద్వారా.. ఏపీ హైకోర్టులో ముందస్తుందో ఎల్పీటీషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక దీనిపై మరి కాసేపట్లోనే విచారణ కూడా జరగనున్నట్లు సమాచారం. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా కోర్టు నిర్ణయం ఉంటే... మళ్లీ మాచర్లకు యధావిధిగా వస్తారు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా కోర్టు నిర్ణయం తీసుకుంటే... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో ప్లాన్ వేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఏదేమైనా.. పోలీసులు అరెస్టు చేయకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే మాచర్ల నియోజకవర్గం నుంచి తెలంగాణకు వచ్చిన ఆయన... ఓ రహస్య ప్రాంతంలో ఉన్నారట. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆశ్రయం కల్పించినట్లు సమాచారం అందుతుంది. అటు మాచర్ల నియోజకవర్గంలో... బై పోలింగ్ నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. మరి టీడీపీ పార్టీ డిమాండ్‌ పై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: