తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. ఓ పక్క మరో 10 సంవత్సరాలు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పుకు వస్తుంటే మరోపక్క కేటీఆర్ వారిపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హతా వేటు వేయకుండా వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండి పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత ఊరటనిచ్చాయి. 2029 తర్వాత కూడా ప్రజలు మావెంటే ఉంటారని ఎన్నికలు చూస్తే అర్థమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకువస్తున్నారు . కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం సృష్టించింది. మరి ఇంతకీ కేటీఆర్ పెట్టిన ఆ ట్వీట్ ఏంటి అంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హతా వేటు వేయలేదు .
దమ్ముంటే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు.. ఉప ఎన్నికలకు వెళ్దాం అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ పెట్టారు. అయితే కేటీఆర్ పెట్టిన ట్వీట్ చాలా మందిని ఆలోచింపజేసింది. ఎందుకంటే కేటీఆర్ పెట్టిన ట్వీట్లో పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారు. అయితే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు తోనే.బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఆ ఎమ్మెల్యేలకు పట్టం కట్టారు.కానీ వారు ప్రజల ఓటును లెక్కచేయకుండా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రజలు వేసిన ఓటుకి విలువ లేదని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయం గురించి సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు..
ప్రపంచం మొత్తం పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతుంటే స్పీకర్ కి అర్థం అవ్వడం లేదా.. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ రాజకీయ పరిణామాలు గమనించకపోవడం ఎలా సాధ్యం.. కొంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా పార్టీ మారామని చెబుతున్నా స్పీకర్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటే ఆ ఎమ్మెల్యేలు రెండు కానోళ్లా అంటూ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. ఏది ఏమైనప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పు మాత్రం చాలా మంది ప్రజలకు నచ్చడం లేదు.ఇక మరికొంతమంది మాత్రం పార్టీ మారడాలు అనేవి కేసీఆర్ నేర్పించిన విద్యే కదా..మొదట కేసీఆర్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.