సినిమా ఇండస్ట్రీ గజగజ.. జగన్ గెలిస్తే అంతే సంగతులు..?

Suma Kallamadi
వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఆదాయం తగ్గిందని అంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ సంపాదన ఎర్న్‌ చేసేది. కానీ వైసీపీ పరిపాలనలో అది రివర్స్ అయ్యింది. వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యింది. దానిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సినిమా టికెట్లపై ఒక నియంత్రణ తీసుకొచ్చారు.
గతంలో 500, 700, 1000 రూపాయలు ఇలా సింగిల్ టికెట్‌ను ఎక్కువ రేటుకు అమ్మేవారు కానీ ఇప్పుడు 150 నుంచి రూ.250 లోపు మాత్రమే మాక్సిమం టికెట్ ప్రైస్ గా మారింది. ఇంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అంతేకాకుండా 20% షూటింగ్స్ ఏపీలో జరుపుకుంటేనే ఆ సినిమాలపై రాయితీ ఇస్తా అని కూడా ఒక రూల్ పెట్టారు. అలానే ఎక్స్‌ట్రా షోలకు అనుమతి ఇస్తామని ఒక నిబంధన తెచ్చారు. ఈ రూల్ కారణంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్ 20% ఆంధ్రలో జరిగేలా చూసుకుంటున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈ రూల్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఆయన పరిపాలనలో టికెట్ల రేట్లు వారం, లేదంటే పది రోజులు వరకు ఏ రేంజ్ లో నైనా టికెట్లను అమ్ముకోగలిగే అవకాశం ఉంటుంది. రాయితీలు కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా లభించవచ్చు. దీనివల్ల థియేటర్ వాళ్లు వారం లేదా పది రోజుల్లో టికెట్టు కాస్ట్ ఎక్కువగా పెట్టి సినిమా 50-60 కోట్లు వెంటనే వెనక్కి రాబట్టుకోగలరు.
గడిచిన 5 ఏళ్లలో 20 నుంచి 40 రూపాయలు మాత్రమే పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది వైసీపీ. ఇంతకుమించి ఎక్కువ ఏ సమయంలోనూ వసూలు చేయకూడదని  స్పష్టం చేసింది. ఈ రూ.40, రూ.20 పెరుగుదల వల్ల థియేటర్లకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండదు. సినిమా బడ్జెట్ తిరిగి పొందడం కూడా కష్టమే. ఈ టికెట్ పై విధించిన నియంత్రణ అనేది చిన్న సినిమాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు కానీ పెద్ద సినిమాలకు మాత్రం ఇది పెద్ద రిస్కే అవుతుంది. ఎక్కువ డబ్బులు వంద 150 టికెట్ల రేట్లతో వారం రోజుల్లో కలెక్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది. అందుకే జగన్ మళ్లీ సీఎం అవుతారో ఏమో సినిమా ఇండస్ట్రీ గజగజలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: