జరుగుతున్న హత్యలు బాబుకి కనబడడం లేదా?

Suma Kallamadi
దేశ రాజకీయాలతో పలు రాష్ట్రాలతో పోలిస్తే ఒకప్పుడు ఆంధ్రా రాజకీయాలు అనేవి చాలా ఆరోగ్యవంతంగా నడిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓ దశాబ్దకాలంగా చూసుకుంటే ఇక్కడ హత్యాపూరిత రాజకీయాలు అనేవి చాలా దారుణంగా పెరిగిపోయాయి. ప్రభత్వాలు కక్షా పూరిత రాజకీయాలకు తోవ లేదంటూనే వాటికి ఆజ్యం పోసే పరిస్థితి మారింది. చంద్రబాబు లాంటి సీనియర్ నేత తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు. అలాంటి పెద్దమనిషికి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కనబడడం లేదా? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గడిచిన ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ హయాంలో ఏదైతే రిపీట్ అయిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవును, గతంలో వైసీపీ ఎటువంటి అరాచక పాలన కొనసాగించిందని టీడీపీ ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చిందో తాజా కూటమి ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారో లేదో యాబై రోజులకే రాష్ట్రంలో ఒక దారుణ హత్య చోటు చేసుకోవటం.. సర్వత్రా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. అందుకే ఆ హత్య కేసుతో ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయినా బయటకి చంద్రబాబు ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం మరో ఎత్తు అని విపక్షం ఆరోపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా వినుకొండలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా రషీద్ అనే వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేయటం అందరూ కళ్లారా చూశారు. హత్య చేసిన వ్యక్తి సైతం కొంత కాలం క్రితం వరకు వైసీపీ ఫాలోయరే అని తెలుస్తోంది. అయితే రషీద్ మర్డర్ కేసును చూసినప్పుడు.. దాన్ని హ్యాండిల్ చేసే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది అని గుసగుసలు వినబడుతున్నాయి. అదే సమయంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదరు మర్డర్ మీద స్పందించిన తీరు ఇపుడు టీడీపీకి ముచ్చమటలు పట్టేలా చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: