'దేవర' గెటప్ లో వినాయకుడు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..!!

murali krishna
వినాయక చవితి వేళ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ వేదికగా ప్రజలు, అభిమానులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్..ఈ సందర్భంగానే తాను నటించిన లేటేస్ట్ చిత్రం 'దేవర' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‎పై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తోన్న దేవర సినిమా ట్రైలర్‎ను ఈ నెల (సెప్టెంబర్) 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‪కు కిక్కెంచాడు ఎన్టీఆర్. ఈ మేరకు జూనియర్ ఓ పోస్టర్‎ను షేర్ చేశాడు.ఈ పోస్టర్‎లో ఎన్టీఆర్ ఓ రాయిపై నిలబడి చేతిలో గొడ్డలి వంటి పదునైన ఆయుధం పట్టుకుని సీరియస్‍గా చూస్తుండగా.. వెనక అలలు ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్‎లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్‎లో 27.09.24న ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ విడుదల కానుందని రిలీజ్ డేట్‎ను అభిమానులకు మరోసారి గుర్తు చేసింది మూవీ యూనిట్. స్వయంగా దేవర ట్రైలర్ రిలీజ్ డేట్‎పై ఎన్టీఆర్ అనౌన్స్‎మెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ ట్రైలర్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తోన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు తారక్ అభిమానులు.
ఇప్పటికే దేవర మూవీ నుండి విడుదలైన టీజర్, సాంగ్స్‏కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేవర ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ అయితే ఓ ఊపు ఊపేస్తు్న్నాయి. ఈ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో.. దేవర సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‏లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఇవాళ తారక్ దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రముఖ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఇదిలావుండగా వినాయక చవితి నేపథ్యంలో పలుచోట్ల కొందరు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. ఇప్పటికే క్రికెట్, పుష్ప ధీమ్ తో ఉన్న గణేశులు వైరల్ అవుతుండగా ఏపీలో ఓ చోట దేవర గెటప్ లో ఉన్న వినాయకుడిని ప్రతిష్టించారు. చేతుల గొడ్డలితో ఉన్న విగ్రహం వైరల్ అవుతుంది. అయితే అభిమానం మాటున ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం సరికాదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: