పుష్ప టు విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద జరిగిన తొక్కిసలాటలో రేవతి,ఆమె కొడుకు ప్రాణాలు విషమంగా ఉండడంతో అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఎంత హడావిడి జరిగిందో చెప్పనక్కర్లేదు. ఈ అరెస్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో నాకు ఇలాంటి సంబంధం లేదు. చట్టం తన పని చేసుకుంటుంది అంటూ చెప్పారు.అయితే తాజాగా ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ సంధ్యా థియేటర్ దగ్గర హీరోగాని, హీరోయిన్ గాని రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు.పర్మిషన్ ఇవ్వకుండా కూడా హీరో వచ్చి ర్యాలీలు తీశాడు.రోడ్ షో చేయడం వల్ల వేలాది మంది ఒకేసారి గుమిగూడి రావడంతో తొక్కిసలాట జరిగి తల్లి చనిపోయి కొడుకు ప్రాణాలు విషమంగా మారాయి. హీరో అరెస్ట్ అయితే ఆయనకేదో కాళ్లు చేతులు విరిగినట్టు కళ్ళు పోయినట్టు ఆయన్ని పరామర్శించడానికి సినీ ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా వెళ్ళింది.
మరి ఆ మహిళ చనిపోవడం ఆ బాలుడు నెలరోజుల నుండి చావు బతుకుల మధ్య పోరాడితే ఎవరైనా వెళ్లి చూస్తున్నారా.. ఆ హీరోకి ఏమైనా కాళ్లు విరిగాయ చేతులు విరిగాయ ఆయన్ని చూడడానికి వెళ్తున్నారు అంటూ అసెంబ్లీలో అల్లు అర్జున్ పై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన చాలా బాధాకరం.. ఆ లేడీ చనిపోయినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఆ అబ్బాయి పూర్తి ఆరోగ్యంగా బయటపడాలని నేను కోరుకుంటున్నాను.థియేటర్లో జరిగిన ఘటనపై నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు.
నేను కావాలనే రోడ్ షో చేశానని ఇలా ఎన్నో మాట్లాడుతున్నారు కానీ నేను రోడ్ షో చేయలేదు. నేను థియేటర్ నుండి కనీసం మీటర్ దూరంలో కూడా లేను.ఆ టైంలో అందరూ నన్ను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కానీ అప్పుడు నేను కారులో కనిపించకుండా కూర్చుంటే గర్వం ప్రౌడ్ ఉంది అనుకుంటారు. అందుకే లేచి నిలబడ్డాను. అంతేకానీ నేను రోడ్ షో చేయలేదు. ఇక పోలీసులు అందరూ క్రౌడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటే పర్మిషన్ ఇచ్చారు కావచ్చు. అందుకే పోలీసులు అలా చేస్తున్నారు అనుకున్నాను పర్మిషన్ లేదని నాకు కూడా తెలియదు.నేను రోడ్ షో చేశానని నాపై ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. చాలామంది కావాలనే నాపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు.చనిపోయారని తెలిసాక కూడా నేను సినిమా చూశానని అంటున్నారు.నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. చనిపోయారని తెలిసాక అలా థియేటర్లో సినిమా చూస్తూ కూర్చోగలనా..
నాపై ఎందుకు ఈ తప్పుడు ఆరోపణలు. ఈ ఆరోపణలు వింటుంటే నాకు చాలా బాధేస్తుంది. ఈ విషయం తెలియడంతోనే వెంటనే ఆ కుటుంబాన్ని కలవాలనుకున్నాను. కానీ అప్పటికే నాపై కేసు పెట్టారని తెలిసింది.దాంతో లీగల్ గా వారిని కలవడం కుదరదని నన్ను ఆపేసారు. కానీ సుకుమార్ ని,సుకుమార్ భార్యని, మా నాన్నని, బన్నీవాసుని ఇలా చాలామందిని వారిని కలవడానికి పంపించాను. శ్రీదేవి పూర్తి ఆరోగ్యంతో బయటపడడం కోసం ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెడతామని చెప్పాను. ఆయన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని ఇలా ఎన్నో ఆలోచించాం.. అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయట పెట్టారు