భోజనంలో ఆవకాయ పచ్చడి లేదని కేసు.. హోటల్ రూ.35 వేలు ఫైన్?

praveen
ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే హోటల్లో ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడరు. ఈ క్రమంలోనే హోటల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఇక ఎన్నో రకాల సాకులు కూడా వెతుక్కుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. బాధ కలిగిందని కొంతమంది.. ఆనందం వచ్చిందని ఇంకొంతమంది.. వెకేషన్ ఉందని మరి కొంతమంది.. ఇలా ఇక హోటల్లో ఫుడ్ తినడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటూ ఇక ఇంటి ఫుడ్ ను అవాయిడ్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి.

 మరోవైపు హోటల్లో మసాలాలు దట్టించిన రుచికరమైన ఆహారం అందుబాటులో ఉండడంతో ఈ మధ్యకాలంలో అయితే ఇంటి వంట ఎవరికీ నచ్చడం లేదు. అయితే సాధారణంగా ఎప్పుడైనా హోటల్కు వెళ్లి ఇక మనకు కావాల్సిన ఆహారం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు.. అందులో ఏదైనా తక్కువ అయితే.. అడ్జస్ట్ అయ్యి తినేయడం చేస్తూ ఉంటాం. ఇక ఏ ఐటమ్ తక్కువైనా కూడా కొంతమంది అడిగి తెప్పించుకోవడానికి ఇష్టపడరు. పోనీలే మర్చిపోయి ఉంటారు అని సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇలా సర్దుకుపోకుండా ఏకంగా ఐటమ్ తక్కువగా ఇచ్చిన వారిపై కేసు వేస్తే మాత్రం వారిగా డబ్బులు పొందే అవకాశం ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

 ఈ మధ్యకాలంలో ఇలా రెస్టారెంట్లు ఏ చిన్న తప్పు చేసిన వారిపై కేసులు వేసి ఇక భారీగా జరిమాణాలు పొందుతున్న వారి సంఖ్య కాస్తే ఎక్కువ అవుతుంది.  ఇక ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. విల్లుపురంలో ఒక హోటల్ భోజనం పార్సిల్లో ఊరగాయ లేకపోవడంతో ఆరోగ్య స్వామి అనే వ్యక్తి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. అన్నంతో పాటు 11 రకాల ఐటమ్స్ ఇస్తామనడంతో అతను 25 భోజనాలను 2000 చెల్లించి తెచ్చుకున్నాడు. తీరా ఓపెన్ చేస్తే ఊరగాయ కనిపించలేదు. హోటల్ యజమానిని అడిగితే దురుసు సమాధానం ఇవ్వడంతో.. అతనికి కోపం నషాలానికి అంటింది. వెంటనే ఇక ఈ విషయంపై కేసు వేస్తూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఏకంగా ఆ హోటల్ కి 35000 వేల జరిమాన విధించడంతోపాటు సదర్ కస్టమర్ కి ఇక అదనంగా   25 రూపాయలు పచ్చడి ఇవ్వనందుకు చెల్లించాలి అంటూ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: