మెగాస్టార్ విశ్వంభర వచ్చేది అప్పుడేనా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో భారీ సోసియో ఫాంటసిక్ అడ్వెంచర్ మూవీ విశ్వంభర. ఈ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడమే కాకుండా ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలవ్వగా చిరంజీవి లుక్స్, విఎఫ్ఎక్స్ కి ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి.


దీంతో ట్రైలర్ రిలీజ్ సమయానికి  విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఉండేందుకు మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయాన్ని తీసుకున్నారు. దీనివల్లే ఈ సినిమా ఆలస్యానికి కారణమైందనే విధంగా వినిపించాయి. దీంతో కొద్దిరోజుల పాటు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయబోతోందని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.


వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా వచ్చేయడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాతే విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే విశ్వంభర సినిమాకి సంబంధించి అదిరిపోయే న్యూస్ చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, త్రిష, ఇషా చావ్లా తదితర నటీనటులు సైతం ఇందులో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని రూ .200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: