ఏపీ: రఘురామకృష్ణంరాజు పై.. సునీల్ కుమార్ సంచలన ట్విట్..!
అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా తెలియదు గుర్తులేదు అనే సమాధానాలు సునీల్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు విచారణకు హాజరైన తర్వాత ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ మరింత ఆసక్తి రేపుతోంది..తాజా ట్విట్ ప్రకారం సునీల్ కుమార్.. ఈ దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారు ఇది మంచిదే.. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణం గారిని కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా, సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవి నుంచి కూడా తొలగించాలని తెలియజేస్తూ చట్టం అందరికీ సమానంగా ఉంటుంది అనేలా మెసేజ్ వెళ్ళాలి అంటూ ఒక ట్విట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వ్యవహారాన్ని మరొకసారి తెరపైకి తెచ్చారు.
ఈ ట్వీట్ పైన పలు రాజకీయ పార్టీలే కాకుండా న్యాయవర్గాలు కూడా ఎలా స్పందిస్తాయని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో సిబిఐ విచారణ పురోగతి ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఉత్కంఠత పెరుగుతోంది. పీవీ సునీల్ కుమార్ సస్పెండ్ వెనుక ముఖ్య కారణం అనుమతి లేకుండా చాలా సార్లు విదేశీ పర్యటనలు చేయడం వల్లే నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఆయనను కూటమి ప్రభుత్వం దూరం పెట్టింది.