కెరియర్ గ్రాఫ్ అంటే ఇది.. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చాడు.. అడవి శేష్..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో కొంత మంది ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలా చిన్న సినిమాల ద్వారా నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న అడవి శేష్ ఆ తర్వాత క్షణం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో హీరో గా కూడా అడవి శేషు కి మంచి గుర్తింపు లభించింది.

ఇక వరుసగా ఈయన నటించిన అనేక సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈయన ఆఖరుగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈయన కెరియర్ బిగినింగ్ లో రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన బలుపు మూవీ లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ ను అడవి శేషు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు.

కానీ ఆమె ఆ పెళ్లికి ఒప్పుకోదు. దానితో ఆమెను కొట్టి మరీ ఆ పెళ్లి చేసుకోవాలి అని శేష్ నిర్ణయించుకుంటాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే కెరియర్ బిగినింగ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమాలో చిన్న పాత్రలో నటించిన అడవి శేషు ఇప్పుడు ప్రస్తుతం శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం డొకాయిట్ అనే మూవీ రూపొందుతుంది. ఇలా చిన్న స్థాయిలో కెరియర్ను మొదలు పెట్టిన అడవి శేషు ప్రస్తుతం అద్భుతమైన స్థాయికి ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: