సూర్యవంశం సినిమాలో వెంకటేష్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా పలు సినిమాల్లో నటించిన వారందరూ ఇప్పుడు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. శ్రీవిద్య కావ్య కళ్యాణ్ రామ్ తేజ సజ్జ వంటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ కొందరు మాత్రం సినిమాలకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం..

 జగపతిబాబు సౌందర్య మహేశ్వరి జంటగా నటించిన ప్రియురాలు సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే గుర్తుపట్టకపోవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించాడు ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరని చూస్తున్నారా.. అతని పేరే ఆనంద్ హర్షవర్ధన్. అయితే ఈ కుర్రోడు వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమాలో వెంకటేష్ కొడుకు గా కనిపించాడు. వెంకటేష్ మీనా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు పాత్రలో కనిపించాడు. ఆ తరువాత విక్టరీ

 వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాలో కూడా వెంకటేష్ మేనల్లుడి పాత్రలో కనిపించాడు. ఇక అలా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాల్లో నటించాడు. పెళ్లి పీటలు ప్రేయసిరావే తిరుమల తిరుపతి వెంకటేశ మనసంతా నువ్వే ఇంద్ర తొలిచూపులోనే నేనున్నాను. వంటి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలాగే కన్నడలో సైతం సినిమాలు చేశాడు. ఇప్పటికే బాల నటుడిగా దాదాపుగా 25 సినిమాలు కంటే ఎక్కువగా నటించాడు ఈ కుర్రోడు. ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యాడు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కుర్రోడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.  తాజాగా ఈ బుడ్డోడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆన్ ది వే అని సినిమా చేస్తున్నాడు .ఈ సినిమాతో పాటు నిద్రించదు జహాపనా అనే సినిమా కూడా చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: