లోకేష్: సైలెంట్ ఎందుకు.. తెర వెనుక ఏం జరుగుతోంది..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అభ్యర్థులు, పార్టీ అధినేతలు  సైతం ప్రతి ఒక్కరు కూడా తమ తమ నియోజకవర్గాలలో చాలా బిజీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది అదేమిటంటే టిడిపి పార్టీ నేతల మధ్య మాత్రమే ఈ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఎక్కడ కూడా పెద్దగా హైలైట్ గా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈయన ప్రసంగాలు కూడా ఎక్కడ కనిపించకపోవడంతో  తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు లోకేష్ ఒక్క రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి ఓడిపోయిన నారా లోకేష్ అక్కడి నుంచి ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ వేస్తున్న సమయంలో తన కుటుంబంతో దిగిన ఫోటోలప్పుడు మాత్రమే లోకేష్ హైలెట్ అయ్యారు. అప్పుడు  తప్ప మిగిలిన రోజులు పెద్దగా ఎక్కడ కనిపించలేదు.. కానీ ట్విట్టర్లో మాత్రం పోస్ట్లు చేస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలు పవన్ ను చాలా ఇబ్బందికరంగా పెట్టాయని.. లోకేష్ వల్లే కూటమి కూడా ఆలస్యం అయిందని.. లోకేష్ మాట్లాడిన ప్రతి మాట కూడా టిడిపి పార్టీకి చేటు చేస్తుందని..అవసరం లేని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారని వాదన టిడిపి నేతలు వినిపిస్తోంది. అందుకే చంద్రబాబు కేవలం తన కొడుకుని మంగళగిరికే పరిమితం కావాలని క్లియర్ గా చెప్పినట్టుగా సమాచారం.

ఈసారి తేడా కొడితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన కార్యకర్తలు అభిమానులు తెలియజేస్తున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా మంగళగిరిలో గెలవాలని పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీడియా కూడా లోకేష్ ని అవసరానికి మించి హైలెట్ చేయకూడదని విధంగా వ్యవహరిస్తున్నారు. అతి ప్రచారం చేయడం కూడా లోకేష్ కి ఉత్సాహాన్ని తెప్పిస్తుందని దీనివల్ల టిడిపి పార్టీకి బొక్క పడుతుందని గ్రహించిన చంద్రబాబు కేవలం తనని మంగళగిరిలో మాత్రమే ఉండేలా చేస్తున్నట్లు సమాచారం. మరి ఇలాంటి ఎన్నికలలో ఫలితం ఏ రీతిలో ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: