ఏపీ: షర్మిలకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ టీమ్.. తీవ్ర అసంతృప్తిలో వైఎస్ఆర్ బిడ్డ..?

Suma Kallamadi
భారతదేశంలో 544 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ 328 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడితేనే మోదీపై గెలవడం కష్టం అలాంటిది కేవలం 60 శాతం సీట్లలోనే పోటీ చేస్తే గెలవడం దాదాపు అసాధ్యం.
నిలబడిన అన్ని చోట్లల్లో కాంగ్రెస్ గెలవదు. నిలబడిన చోటలో 85% విన్నింగ్ పర్సంటేజ్ ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ బీజేపీ లాంటి బలమైన పార్టీని అంత చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్ కి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ 22 స్థానాల్లో లోక్ సభ అభ్యర్థులను రంగంలోకి దింపించి. ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నుంచి పెద్ద నేతలు ఎవరు ఏపీకి రాలేదు. రాహుల్ గాంధీ షర్మిల కోసం వచ్చారు కానీ వెంటనే వెళ్ళిపోయారు. రాహుల్ షర్మిలకి ఓటు వేయాలంటూ ఒక సభలో చెప్పారు ఆ సభకి అటెండ్ అయిన ప్రజల సంఖ్య రెండు మూడు వందల కంటే ఎక్కువగా ఉండదని సమాచారం. రాహుల్ గాంధీ కంటే ముందు రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చి వెళ్లారు.
 వీళ్ళిద్దరూ తప్పించి పెద్ద నేతలు ఎవరూ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లాంటి పెద్ద నేతలు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కి చెందిన కేంద్ర నాయకులు చాలామంది ఉన్నారు. వారొక్కరు కూడా షర్మిల కి సపోర్ట్ గా ప్రచారానికి రాలేదు. కాంగ్రెస్ టీం ఏది అనే షర్మిలను అడిగితే ఆమె దగ్గర కూడా సమాధానం లేదేమో.  వైఎస్ఆర్ కూతురుని అంటూ ఈమె ఎంతో ప్రచారం చేస్తూ బాగానే విమర్శలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ టీం ఆమె కోసం ఏపీలో దిగకపోవడం నిరాశపరిచే, తీవ్ర అసంతృప్తిపరిచే అంశమే. మరోవైపు షర్మిల ఎంత కష్టపడుతున్నా కాంగ్రెస్ కు పాపులారిటీని కొంచెం కూడా పెంచలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: