ఇషాన్ కిషన్ కి.. షాక్ ఇచ్చిన బీసీసీఐ?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ లో ఆడుతున్న ప్రతి ఆటగాడు కూడా రూల్స్ కి అనుగుణంగానే తమ ఆటను కొనసాగించాలి. ఈ క్రమంలోనే ఇక మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఇలా కంట్రోల్ కోల్పోయి కొన్ని కొన్ని సార్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా అతిగా ప్రవర్తించారు అంటే చాలు ఇక వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా చూస్తూ ఉంటాం.
 అయితే ఇక ఇప్పుడు హోరాహోరీగా జరుగుతున్న ఐపీఎల్ లో కూడా ప్రవర్తన నియమాలని ఉల్లంఘించినందుకు గాను కొంతమంది ఆటగాళ్లకు ఇప్పటికే జరిమానా విధించింది ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్ ఆటగాడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు కూడా బీసీసీఐ భారీ జరిమానా విధించింది అని చెప్పాలి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్,ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో 10 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్ కి ఓటమి తప్పలేదు.

 అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్కు బిసిసిఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10% కోత విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఐపిఎల్ ప్రవర్తన నియమవ్వాలని ఉల్లంఘించినందుకుగాను  ఇలా జరిమానా విధించినట్లు తెలిపింది బీసీసీఐ. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఇషాన్ కిషన్ అంతంత మాత్రం గానే రాణిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్లలో కలిపి కేవలం 212 పరుగులు మాత్రమే చేశాడు. రానున్న రోజుల్లో వరల్డ్ కప్ కి సెలెక్ట్  కావాలంటే ఇషాన్ కిషన్ మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: