హరీష్ రావు : బీజేపీ తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్..?

Pulgam Srinivas
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి ఉధృతంగా పెరుగుతుంది. ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ , బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రాధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తూ వస్తున్నాడు. 

అలాగే తనను , తన పార్టీను ఎవరైనా ఎమైన అన్నట్లు అయితే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తులు అయినటువంటి కేటీఆర్ , హరీష్ రావు కౌంటర్ లు ఇస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా హరీష్ రావు ఓ సభలో మాట్లాడారు. అందులో భాగంగా ... బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఆయన అలా అనడం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టున్నాయి ఆయన మాటలు. బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నది మేము కాదు రేవంత్.  

హుజారాబాద్‌ , దుబ్బాక , మునుగోడు లో కావాలనే బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలవడానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరించాడు. అలాగే నాగార్జన సాగర్ లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయి. అక్కడ బీజేపీ బలహీనమైన అభ్యర్దిని పెట్టడం వల్ల కాంగ్రెస్ , బీజేపీ ఒకరికొకరు సహకరించుకున్నారు . రేవంత్‌ ది అతి తెలివి లేదా మతి మరుపు . గ్లోబెల్స్ ప్రచారంతో ఎంపీ ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నాడు అని తాజా సభలో భాగంగా హరీష్ రావు మాట్లాడాడు . ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ , ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా భారీ స్థాయిలోనే మాటల యుద్ధాలు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: