చనిపోయిన వ్యక్తిని.. ఎమ్మెల్యేగా గెలిపించారు?

praveen
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఈ క్రమం లోనే కొన్ని రాష్ట్రాలలో అయితే అటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యం లో.. పాలిటిక్స్ వాడి వేడిగా మారిపోయాయి అని చెప్పాలి. గెలుపే లక్ష్యం గా అన్ని పార్టీలు ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి. గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయం పై ఇక స్పష్టమైన హామీలను కూడా ఇస్తున్నాయి. అయితే ఎవరెన్ని హామీలు ఇచ్చినా ఎవరికి ఓటు వేయాలి అనే విషయంపై ఓటర్లు ఎప్పుడూ ఒక క్లారిటీతోనే ఉంటారు.

 ఇక తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాడు అన్న నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం ఒక విచిత్రకరమైన ఘటన జరిగింది. ఏకంగా చనిపోయారు అని తెలిసి కూడా అదే అభ్యర్థిని ప్రజలు ఇక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం గమనార్హం. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ లో మారిపోయింది. ఇది ఎక్కడో కాదు ఏపీలోనే జరిగింది. చనిపోయినప్పటికీ అదే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకున్నారు.

 2014 అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆళ్లగడ్డ వైసిపి అభ్యర్థి శోభ నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి యధావిధిగా ఎన్నికల నిర్వహించారు. ఇక అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకున్న శోభా నాగిరెడ్డికి ఇక చనిపోయింది అని తెలిసినప్పటికీ ప్రజలు మరోసారి భారీగా ఓట్లు వేసి గెలిపించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఆంధ్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక తర్వాత అక్కడ మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చనిపోయిన వ్యక్తిని గెలిపించడం మాత్రం అప్పట్లో సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ycp

సంబంధిత వార్తలు: