రాయలసీమ: వైసీపీలో ఆగని అసమ్మతి సెగలు..!

Divya
అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ పార్టీలో అసమతి జ్వాల ఇంకా చల్లారలేదు.. పోలింగ్ కు మరి కొద్ది గంటల సమయం ఉన్న సమయంలోనే ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు మరొకసారి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అధిష్టానం మాత్రం నాయకులందరినీ కూడా ఒకే తాటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అవి విఫలమవుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది.నిన్నటి రోజున వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు నార్పలలో రోడ్డు షోని నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మసీదు వద్దకు సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి తో కలిసి వీరాంజనేయులు కూడా వెళ్లారు. ఆ సమయంలోనే కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లలేదట.

అనంతరం రోడ్డు షో ప్రారంభం కానే గాని కొంతమంది నాయకులు జిల్లా అధ్యక్షుడు అయిన పైలా నరసింహయ్య, వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు కలిసి రోడ్డు షో లో పాల్గొనడం జరిగింది. ఇలా ఒకరు కలిసినచోట మరొక నాయకుడు కలవకుండానే ఈ రోడ్డు షో సాగింది.. నాయకులందరినీ కూడా కలుపుకొని అధిష్టానం ముందుకు వెళ్లాలనుకున్న అది సాధ్యపడలేదు.. ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఉంటున్న ఆలూరు సాంబశివారెడ్డి వెంటనే నార్పలకు చేరుకొని సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద వెళ్లి రోడ్డు షో కి రావాలని కోరినట్టుగా తెలుస్తోంది.

దీంతో కొంత మంది నేతలు పార్టీలో జరుగుతున్న అవమానాలను భరించలేమంటూ సాంబశివారెడ్డి వద్దకు వచ్చి అసహనాన్ని తెలుపుతున్నట్లు సమాచారం.. జిల్లా నాయకత్వం కేవలం ఒక వర్గం వారిని మాత్రమే ప్రోత్సహిస్తోంది అంటూ కావాలనే కొంతమందిని నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనాన్ని కూడా తెలుపుతున్నారు. అలా కొద్దిసేపు సత్యనారాయణ ఇంటి వద్ద ఉధృత వాతావరణం నెలకొన్నది.. దీంతో సత్యనారాయణ కలుగజేసుకొని అక్కడున్న వారందరిని గుంపుగా ర్యాలీకి తీసుకువెళ్లారు.. మరి వైసీపీలో కొను తాగుతున్న ఈ అసమతి సెగ పోలింగ్ రోజున ఎలాంటి పరిస్థితి తీసుకువచ్చేలా ఉంటుందో అంటూ వైసీపీలో పలువురు నేతలు కార్యకర్తలు కలవర పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: