కమాల్ హై.. కేసీఆర్ కంచుకోటఫై కాషాయ జెండా?

praveen
ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అటు బిఆర్ఎస్ పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉండగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేయడానికి ఎంతో మంది అభ్యర్థులు అందుబాటులో ఉండేవారు. ఇక ఎవరికైనా టికెట్ ఇస్తే ఏకంగా అసంతృప్తిని వెళ్ళగక్కే నేతలు కూడా చాలామందే. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కనిసం నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది.

 ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితుల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది కారు పార్టీ. కనీసం ఈసారి అయినా మెజారిటీ సాధించి ఇక పార్టీలో ఉన్న నేతలను మరో పార్టీలోకి వలస వెళ్లకుండా  కాపాడుకోవాలని భావించింది. కానీ ఊహించని రీతిలో అటు బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుంది అన్నది ఇప్పటికే విడుదలైన ఫలితాల ద్వారా అర్థమవుతుంది. కేవలం ఒకే ఒక్క స్థానంలో బిఆర్ఎస్  పార్టీ గెలుస్తుంది అనుకున్న.. అక్కడ గెలుస్తుందా లేదా అన్న విషయంపై చివరికి అనుమానాలు నెలకొన్నాయ్. ఆ ఒక్క స్థానం ఏదో కాదు కెసిఆర్ కు సొంత జిల్లా అయిన మెదక్. మెదక్ లో ఎన్నో ఏళ్ల నుంచి అటు బిఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తూ వచ్చింది. ఇక కారు పార్టీకి మెదక్ కంచుకోటగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఈ కంచుకోట బద్దలు కాబోతుందా అంటే అవును అనే సమాధానమే గట్టిగా వినిపిస్తుంది.

 ఎందుకంటే కెసిఆర్ సొంత ఇలాకా.. కారు పార్టీ కంచుకోట అయినా మెదక్లో కాషాయ జెండా ఎగిరేలాగే కనిపిస్తుంది. మెదక్లో రెండో రౌండ్ వరకు ఆదిత్యంలో కొనసాగుతూ వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆదిక్యాన్ని కోల్పోయింది. బిజెపి అభ్యర్థి రఘునందన్ లో 1731 ఓట్ల ఆదిత్యంలోకి వచ్చేసారు. బిఆర్ఎస్ పార్టీకి 63655 బిజెపికి 65386 కాంగ్రెస్కు 63,273 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక కారు పార్టీ కంచుకోట బద్దలై కాషాయ జండా ఎగరేలాగే కనిపిస్తుంది. దీంతో కనీసం ఒక్క సీటు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అటు బిఆర్ఎస్ గెలవగలద అనే విషయంపై అనుమానాలు నెలకొంటున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: