ఓటరు ఒపీనియన్ ని ఆపేదెవడ్రా.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి నాయకులారా?

Divya
ఓటర్.. డబ్బులు ఇస్తే ఎవరికైనా ఓటు వేస్తారు అనే ధీమా లో ఉండేవారు నాయకులు.. అందుకే నోటుకు ఓటు అనే కాన్సెప్ట్ తో చాలామంది నాయకులు ఓటర్లకు డబ్బులు పంచి తామే అధికారంలోకి వస్తామంటూ విర్రవీగారు.. కానీ తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే ఓటర్ ఒపీనియన్ ని ఎవరు ఆపలేరు అని స్పష్టం అవుతుంది. ఇప్పటికే చాలామంది ఓటర్ కి డబ్బులు ఇస్తేనో లేక గిఫ్ట్లు ఇస్తేనో తమకు ఓటు వేస్తారు అని.. ఒక గుడ్డి నమ్మకంతో ఉండేవారు.. కానీ ప్రజలు అలా కాదు తమకు పరిపాలనలో న్యాయం కలిగింది అని తెలిస్తేనో లేక నమ్మితేనో వారికి ఓటు వేస్తారని నిరూపించారు .. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలు అంటూ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ ప్రభుత్వం నేడు ఢీలా పడిపోయిందనే చెప్పాలి.. వాస్తవానికి ఓటర్ అంటే కేవలం డబ్బుకు ఆశపడి ఓటు వేస్తారు అని నమ్మే చాలామంది నాయకులకు ఇది గట్టి దెబ్బలాంటిది అని చెప్పవచ్చు.
ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ సమస్యలను తీర్చుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే పట్టినట్టు వ్యవహరించడమే ఇక్కడ ప్రధాన కారణమని చెప్పాలి.. అందుకే నాయకులు ఇకనుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే ఓటర్లు మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాము అధికారంలోకి వస్తే ఏమైనా చేయగలం అనే ధీమా వ్యక్తం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలలో ఓటర్లు గద్దె దింపుతారు అనడానికి ఇది చక్కటి ఉదాహరణ.
ప్రస్తుతం తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే కూటమి 152 స్థానాలలో ఆదిక్యం చూపుతూ ముందంజలో ఉండగా.. వైసిపి కేవలం 23 స్థానాలలో ముందంజలో ఉంది.. విడివిడిగా చూసుకున్నట్లయితే టిడిపి 127 స్థానాలలో ముందంజలో ఉండగా.. బిజెపి 6,  జనసేన 19 స్థానాలలో ఆదిక్యత జోరు చూపిస్తూ ముందుకు సాగుతున్నాయి.. మొత్తానికైతే ఓటర్ దెబ్బకు ఎంతటి వారైనా నేల కొరగాల్సిందే అనడానికి ఇది చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు .. ఇక ఎవరూ కూడా ఓటర్ ఒపీనియన్ ని ఆపలేరు.. కాబట్టి  నాయకులారా ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నెక్స్ట్ అధికారంలో మీరే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: