ఆంధ్రోడు ‘అహంకార’ రాజకీయానికి దూరమే.. ఓటుతో గట్టిగానే చెప్పాడా?

Divya
ఆంధ్రుడు తలచుకుంటే ఏమైనా చేయగలడు అని మరొకసారి నిరూపించాడు.. 2019 ఎన్నికలలో ఒకసారి నిరూపించిన ఆంధ్రుడు.. ఇప్పుడు మరొకసారి ఇదే విషయాన్ని నిజం చేశారనే చెప్పాలి. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ.. ఆ సమయంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో చాలా పథకాలను అమలుపరచలేదు.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 2019 ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు టిడిపి పార్టీని ఘోరంగా ఓడించారు ..ముఖ్యంగా 151 సీట్ల మెజారిటీతో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తర్వాత మేనిఫెస్టో లో పొందుపరిచిన అంశాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ.. నూటికి 98% పథకాలను పూర్తి చేశామని.. ఇంటింటికి తమ పథకాలు అందాయని ప్రచారంలో కూడా చెప్పుకున్నారు.
అయితే ఈ పథకాల వల్ల చాలామంది లబ్ధి పొందారు కానీ ఒక కుటుంబంలో పథకాలకు అర్హత పొందిన వారందరూ కూడా.. డబ్బులు పొందారు అనడంలో ఇంకా సందేహాలు,  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలలో టిడిపి వారిని వైసిపి వారు పట్టించుకోలేదనే వాదనలు కూడా ప్రచారంలో భాగంగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆ వైసీపీలో ఉన్న చాలామంది నేతలు,  మంత్రులు అహంకార భావంతో పనిచేశారనే వార్తలు కూడా వినిపించాయి. చాలామంది తమ గోడును విన్నవించుకున్నా సరే ఎవరు పట్టించుకోలేదని ప్రజలే నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక ఇలా వైసిపి పార్టీ లో ఉండే కొంతమంది వల్ల ఇబ్బంది పడిన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారనీ తాజాగా వెలువడుతున్న  ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది. ఆంధ్రుడు తలచుకుంటే ఏమైనా చేయగలడని మరొకసారి నిరూపించారు.. అహంకార రాజకీయాన్ని దూరం పెట్టడమే ప్రధాన లక్ష్యం అన్న నేపథ్యంలో ఓట్లు వేసి టిడిపిని గెలిపించారని స్పష్టమవుతోంది. అప్పుడు టిడిపిని ఓడించిన ఆంధ్రులే ఇప్పుడు మళ్లీ టిడిపిని గెలిపించారు.. మరి టిడిపి..  ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్తుందా లేదా తెలియాలి అంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనను దగ్గరుండి మరీ చూస్తే తప్ప ప్రజలు వచ్చే ఎన్నికలలో నిర్ణయాన్ని మార్చుకోరనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: