ఆంధ్రోడు ‘చిక్కడు.. దొరకడు’! ఓటులో షాకిచ్చాడు!

Pulgam Srinivas
దాదాపుగా ఇండియాలోని ఎక్కువ శాతం రాష్ట్రాలలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే చాలా వరకు ఆ పార్టీ రెండు సార్లు అనగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ ఉంటుంది. చాలా కొన్ని సందర్భాలలో, కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అందులో టిడిపి పార్టీకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు.

వారికి అధికారంలోకి రావడానికి కావలసిన మెజారిటీని ఇప్పించి వారిని గద్దపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆంధ్ర ప్రజలు టిడిపి పార్టీకి గట్టి దెబ్బ కొట్టి వైసిపి పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను ఇచ్చి వారిని తీసుకువెళ్లి గద్దపై కూర్చోబెట్టారు. ఇక కొన్ని రోజుల క్రితమే 2024 కు సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసింది. ఈ ఎన్నికలలో వైసిపి గెలుస్తుంది అని కొంతమంది, కూటమి గెలుస్తుంది అని మరి కొంతమంది అంచనాలు వేస్తూ వచ్చారు. ఎవరు గెలిచిన 10, 20 సీట్లు తేడాతోనే గెలుపొందుతారు అని చాలా సర్వేలు అంచనా వేశాయి.

కాకపోతే ఆంధ్ర ప్రజలు మరోసారి వారి తీర్పును అదిరిపోయే రేంజ్ లో ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీ , పార్లమెంట్ ఫలితాలు విడుదల  కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి చాలా ఎక్కువ స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక వైసిపి మాత్రం 20 కి అటు ఇటుగా ఊగిసలాడుతుంది. వైసీపీ లీడ్ లో ఉన్న 20 స్థానాలలో కూడా భారీ మొత్తంలో లీడ్ లు లేవు. ఇవి కూడా గల్లంతు అయ్యే పరిస్థితిలు ఉన్నాయి. దీనితో వైసిపి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోబోతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక టిడిపి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి రాబోతుంది. ఇలా ఆంధ్ర ఓటర్లు ఎవరికి అంతుచిక్కని ఫలితాలను ఇస్తూ నాయకులకు దిమ్మతిరిగే షాక్ ను ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: