ఏపీ: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. ఏమిటంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో సచివాలయంతో పాటు వివిధ హెచ్వోడీల కార్యక్రమాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సైతం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది.. అదేమిటంటే ఇప్పటికే అమలులో ఉన్నవారికి ఐదు రోజులు పని దినాలను పొడిగిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ సచివాలయం తో పాటు హెచ్ ఓ డి కార్యక్రమంలో పనిచేసే ఈ ఉద్యోగులకు మాత్రమే ఈ వెలుసు బాటు సైతం ఉండనుందట. దీనిపైన ఉత్తర్వులను మరొకసారి జారీ చేశారు. వీటిని మరొక ఏడాది పాటు వారానికి ఐదు రోజులు పని దినాలను అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సచివాలయాల ఉద్యోగుల కోసం అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కూడా అందించారు.. రాజధానిలో క్వాటర్స్ తో పాటు ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండేలా మార్చారు. అయితే వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను కూడా కల్పించినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత హైదరాబాదులోనే తమ కుటుంబాలు ఉండడంతో సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసే దినాలుగా ఈ వెల్స్ బాటను కల్పించారు.

ఐదు రోజుల తర్వాత తమ కుటుంబాలతో కలిసి ఉద్యోగులు గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఉద్యోగులకు ఈ వెలుసుబాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ఈ విషయాన్ని ఇలాగే కంటిన్యూ చేసింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఆగిపోయిన ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలను కొనసాగించింది.ఇప్పుడు కూటమి మళ్ళీ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు కూడా వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించినటువంటి ఐదు రోజుల పని దినములు వెలుసుబాటు  త్వరలో ముగియనున్న సందర్భంగా మళ్లీ ఏడాది వరకు పొడిగించింది ఏపీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: