కల్కి 2898 AD : 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే.. అఫిషియల్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు నుండే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఆ మూడు రోజుల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి.
 

ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేస్తుంది. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 415 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ రోజు హాలిడే కావడంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది. మరి ఈ రోజుతో ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మరి ఈ రోజు ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయో చూడాలి.

ఈ మూవీ లో దిశా పటానీ , ప్రభాస్ కి జోడి గా నటించగా , సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటించారు. విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు. ఈయన ఈ మూవీలో అత్యంత తక్కువ ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ ఆ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: