వామ్మో!యవ్వనంలో జుట్టు నెరిస్తే ఈ భయంకర రోగాలు తప్పవట?

Purushottham Vinay
వామ్మో!యవ్వనంలో జుట్టు నెరిస్తే ఈ భయంకర రోగాలు తప్పవట?

చిన్న తనంలో తెల్ల జుట్టు సమస్య బారిన పడినవారు దీర్ఘకాలంలో ఖచ్చితంగా పలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. తెల్ల జుట్టును సాధారణ కాస్మొటిక్‌ అంశంగా నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జుట్టు తెల్లబడటం అనేది ఖచ్చితంగా హృద్రోగానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదట. పరిశోధనలు నిర్వహించిన తరువాత ఈ వివరాలను వెల్లడించారు.ఈ రోజుల్లో సరిగ్గా పాతికేళ్లు కూడా నిండని వారు తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇది చిన్న విషయంగానే భావించినా కానీ భవిష్యత్తులో ఇలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం వల్ల ఖచ్చితంగా పలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


తెల్ల జుట్టుతో ఇబ్బందిపడే వారిలో ఎక్కువ మందికి అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలిది. అయితే జుట్టు నల్లగా ఉన్నవారిలో ఈ సమస్యలు తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. అయితే తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈజిప్ట్‌లోని కైరో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా సుమారు 600 మందిపై పరిశోధనలు నిర్వహించిన తరువాత ఈ వివరాలను తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా వారి ఆరోగ్యం, జుట్ట రంగు ఆధారంగా పరిశీలించారు. అందరూ కూడా ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. దాదాపు పదేళ్ల పాటు వీరిపై అధ్యయనం చేపట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: