కొన్ని కొన్ని సార్లు ఒక స్టార్ హీరో కోసం అనుకున్న సినిమా మరొక హీరో చేస్తూ ఉంటాడు. అలా ఒక హీరో నో చెప్పిన సినిమా మరొక హీరో చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది. ఇక అలా వచ్చిన సినిమాలతో చాలామంది హీరోలు భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక సినిమాని బాలయ్య బాబు చేశాడు. ఇక ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. మరి చిరంజీవి ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నాడు..? బాలయ్య ఎలా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..? దాంతో హిట్ కొట్టాడు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కోడి
రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో కోడి రామకృష్ణ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరే.. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మంగమ్మగారి మానవుడు సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాను కోడిరామకృష్ణ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. అయితే ఆ కథ నచ్చకపోవడంతో చిరంజీవి నో చెప్పారట. దాంతో కోడిరామకృష్ణ ఇదే కథను బాలకృష్ణ కు చెప్పారట.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. దాంతో ఈ సినిమాను రూపొందించారట.
మంగమ్మగారు మానవుడు సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా బాలయ్య సరసన సుహాసినిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1984 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా కూడా నిలిచింది. అప్పటివరకు బాలయ్య క్రేజ్ వేరు ఈ సినిమా వచ్చిన తర్వాత బాలయ్య క్రేజ్ వేరు. అంతలా ఈ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు బాలయ్య బాబు..!!