బుమ్రాను పాక్ క్రికెటర్ తో పోల్చిన ఆసిస్ మాజీ కోచ్.. ఏమన్నాడంటే?

praveen
ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ జస్ప్రీత్ బుమ్రాని తాజాగా ఆకాశానికెత్తేశారు. ఈ క్రమంలో ఆయన పొగుడుతూ... ఈ భారత ఫాస్ట్ బౌలింగ్ స్పియర్‌ హెడ్‌ పాక్ లెజెండరీ లెఫ్టార్మ్ పేసర్ వసీం అక్రమ్‌కు సమానమైన కుడిచేతి వాటం! అని కొనియాడాడు. ఇకపోతే బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా... 10.90 సగటుతో 21 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లో కెక్కిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా మరియు నాథన్ మెక్‌స్వీనీలను నాలుగు సార్లు అవుట్ చేశాడు బుమ్రా. ఈ క్రమంలోనే ఆసిస్ మాజీ కోచ్ మాట్లాడుతూ... "అతనిని ఎదుర్కోవాలంటే గుబులు పుడుతుంది. ఎందుకంటే అతను వసీం అక్రమ్ లాంటివాడు. సరిగ్గా చెప్పాలంటే వసీం అక్రమ్‌కి కుడిచేతి వెర్షన్, ప్రతిసారీ నన్ను అబ్బురపరుస్తున్న అత్యుత్తమ బౌలర్!" అని పేర్కొన్నారు.
ఇకపోతే ఇటీవల జస్‌ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ స్వయంగా ప్రశంసల జల్లు కురిపించిన సంగతి విదితమే. ఈ తరం అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కొనియాడిన వసీమ్ అక్రమ్.. తన ఫేవరేట్ పేసర్ అని కూడా చెప్పుకు రావడం నిజంగా విశేషం. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ జస్ప్రీత్ బుమ్రాని తాజాగా ఆకాశానికెత్తేయడంతో బుమ్రా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇలా ఒకవైపు బుమ్రాపైన ప్రశంసల జల్లు కురుస్తుంటే, మరోవైపు గబ్బాలో ఆసీస్‌, భారత్‌ మధ్య బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టు జరుగుతున్న సందర్భంగా మ్యాచ్‌లో రెండో రోజు కామెంటేటర్‌ ఇసా గుహా, లైవ్‌లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. బెస్ట్ కామెంటేటర్లలో ఒకడైనటువంటి ఈ మాజీ ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెటర్, భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా పర్ఫార్మెన్స్‌ గురించి చెబుతూ మోస్ట్‌ వ్యాలుబుల్‌ ప్రైమేట్ అని అభివర్ణించాడు. అతగాడు బుమ్రాను అభినందిస్తూ ఈ కామెంట్స్ చేసినప్పటికీ.. ఇలా మాట్లాడటాన్ని అభిమానులు, ఇతర కామెంటేటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. జాత్యహంకార వ్యక్తీకరణలు ఉన్న ఈ పదాన్ని వినియోగించడం పెద్ద దుమారమే రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: