రోహిత్ శర్మ కూతురు అదిరిపోయే డాన్స్.. వీడియో వైరల్?

praveen
టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హిట్ మ్యాన్ భార్య రితికా సజ్దే ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ కుమార్తె ఉందనే సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కుమార్తె "సమైరా" అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో ఒకరుగా ఉన్నారు. అయితే సమైరా తండ్రితో పాటు సోషల్ మీడియాలో అపుడపుడూ యాక్టివ్ గా ఉంటుంది. దాంతోనే తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకుంటోంది. కొన్నాళ్ల క్రితం తండ్రితో పాటుగా ఒక సముద్ర తీరంలో ఇసుకతో గుళ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సమైరా తనదైన డాన్సుతో సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది.
సదరు డాన్సులకు సంబందించిన వీడియోలను చూసిన క్రీడా ప్రపంచం తండ్రికి తగ్గట్టే ఉంది... టాలెంటెడ్ కిడ్ అని అభివర్ణిస్తున్నారు. ఇకపోతే రోహిత్, రితికా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రోహిత్‌ శర్మ, తన మేనేజర్ అయినటువంటి రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో వీరు 2015, డిసెంబర్ 13న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు గుర్తుగా ఈ అందాల జంటకు 2018 డిసెంబరు 30న సమైరా జన్మించింది. ఆ తరువాత తాజాగా 16 నవంబర్ 2024 నాడు కుమారుడికి రితికా జన్మనివ్వడం జరిగింది.
ఇక టీమిండియాకు కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ శర్మ, ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. భారత t20, వన్డే జట్టుకి రోహిత్ ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే. టీమిండియా జ‌ట్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోహిత్ శ‌ర్మ 3 ఫార్మాట్ల‌లో ఆడి, తొలి సిరీస్‌ల్లోనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క్లీన్ స్వీప్ చేసి, కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు తిరగరాశారు. 2023 ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్ గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబరు అజామ్ మాత్రమే ఉండడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: