పిన్నెల్లి ఔట్‌...పల్నాడ్‌ కింగ్‌ ఎవరు ?

Veldandi Saikiran
పల్నాడు రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. పల్నాడులో మొన్నటి దాకా గిరగిరా తిరిగిన ఫ్యాను ఇప్పుడు రెక్కలు ఊడిపోయి కింద పడింది. మళ్లీ రెక్కలు బిగించి అదే స్పీడ్ తో తిప్పగల నాయకుడు ఎవరని క్యాడర్ ఎదురుచూస్తుంది. పల్నాడు జిల్లాలోని ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థులు. ఇప్పటిదాకా పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పార్టీ రీజనల్ ఇన్చార్జిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల ఘర్షణలతో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. రామకృష్ణరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ సమయంలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పల్నాడు సమీకరణాల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గ నేతకే పల్నాడు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారాలు జరుగుతున్నాయి. సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు రాష్ట్రస్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఓటమి తర్వాత కూడా అధికార ప్రతినిధిగా తన వాయిస్ ని వినిపిస్తున్నారు అంబటి రాంబాబు. ఇక వెనుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నంబూరి శంకర్ రావు, బొల్లా బ్రహ్మనాయుడు వ్యాపారాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితిలో వారిద్దరూ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఎంతవరకు ముందుకు వస్తారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఇక చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన విడతల రజిని గుంటూరు వెస్ట్ కి మారి అక్కడ ఓడిపోయారు. దీంతో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన మనోహర్ మళ్లీ గుంటూరు మేయర్ సీటులో కూర్చున్నారు. మళ్ళీ చిలకలూరిపేటలో వైసీపీని నడిపించే నాయకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురజాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి వెళ్లి పరిశీలించారు. ఇటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటర్లపై సమీక్షించుకుంటామని చెప్పారు.
దీంతో కాసు మహేష్, గోపిరెడ్డిలో ఒకరికి పల్నాడు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ కూడా పార్టీ సారధ్యంలో బాధ్యతలు అందుకునేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలనుకుంటుంది వైసీపీ క్యాడర్. మొత్తం మీద ఓటమి తర్వాత పార్టీని నడిపించే నాయకుడి కోసం నేతలే కాదు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ లాంటి పల్నాడులో అధికార పార్టీతో తలబడుతూ పార్టీని ముందుకు నడిపే సమర్థ నాయకత్వం కావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం ముందుకు వస్తుందా లేకపోతే పిన్నెల్లినే కొనసాగిస్తారా అన్నది ముందు ముందు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: