ఏంటి.. కమలహాసన్ కి ఇండియన్ 2 నచ్చలేదా.. ఎందుకంటే..!?

Anilkumar
లోకనాయకుడు కమలహాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ టు. ఇండియన్ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు శంకర వివిధ రాష్ట్రాలకు చిత్ర బృందాన్ని తీసుకెళ్తున్నారు. అయితే ఎవరైనా సరే తమ సినిమా విషయంలో ప్రమోషన్స్ లో చాలా పాజిటివ్గా హిట్ అవ్వాలి అనే మాట్లాడుతూ

 ఉంటారు. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం ఈ విషయంలో రివర్స్ గా మాట్లాడుతున్నట్లు తెలుస్తోం.ది ఇక ఇదే అభిప్రాయాన్ని చాలామంది  సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అయితే 28 ఏళ్ల క్రిందట వచ్చిన భారతీయుడు సినిమా ఇప్పటికీ ఎవర్గ్రీన్ మూవీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అప్పట్లో ఆ సినిమా విడుదల కావడం కంటే ముందే పాటల దగ్గర నుండి కథ నటన మేకప్ వంటి అన్ని విషయాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వచ్చి అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. కానీ ఇప్పుడు

 భారతీయుడు టు సినిమాని అంతకంటే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇదిలవుండగా  భారతీయుడు 2కి ప్రమోషన్స్ ఎక్కువగా చేయకుండా కమల్ ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావన ఆయన అభిమానులకు కలుగుతోంది. ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఇండియన్ 3 సహా ఇండియన్ 4 అలాగే 5 వస్తాయా? అని తాజాగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇండియన్ 2 కోసం 4 గంటలకు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని కమల్ అన్నారు. అంతేకాదు అభిమానులు ముందుగా ఇండియన్ 2 కంటే ఎక్కువ 3ని ఇష్టపడాలని కమల్ బదులిచ్చారు. తాను అసలు ఈ రెండో సీక్వెల్ చేయడానికి అసలు కారణం సినిమా ఫ్రాంచైజ్ లో ఉన్న మూడో భాగం అని ఆయన అన్నారు. ఈ మూడో భాగం రిలీజ్ కి ఇంకా ఆరు నెలలు ఉంది కానీ దానికోసం అయితే తాను వేచి ఉండలేక పోతున్నానని కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: