బాలీవుడ్: కల్కితో హృతిక్ రోషన్ కి ఎసరు పెట్టిన ప్రభాస్?

Purushottham Vinay
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది..కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాలు కలిపి మొత్తం రూ. 380 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 381 కోట్ల షేర్ రావాలి.


 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఏడో రోజు కూడా జనాల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. మిగిలిన అన్ని ఏరియాలూ కలుపుకుని మొత్తం రూ. 20 కోట్లు రాబట్టింది. ఈ సినిమా టోటల్ గా వారంలో రూ. 345 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ మూవీ ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.95 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ రూ.152 కోట్లకి పైగా వసూలు చేసింది. హిందీ మార్కె్ట్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ సినిమాగా కల్కి నిలిచింది. అయితే రూ.199.45 కోట్లతో హృతిక్ రోషన్ ఫైటర్ మొదటి స్థానంలో ఉంది. ఇవ్వాళ రేపటితో కల్కి ఈ రికార్డుని బ్రేక్ చెయ్యనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: