టీమిండియాలో అతను.. కోహినూర్ కంటే విలువైనవాడు : డీకే

praveen
వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో టీం ఇండియా తమ కలను నెరవేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల నుంచి కూడా వరల్డ్ కప్ గెలవడంలో విఫలమవుతూనే ఉంది టీమిండియా. లీగ్ దశ నుంచి వరుసగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఎందుకో కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం తడబడుతూ చివరికి టైటిల్ కలను నెరవేర్చుకోలేక పోతుంది. కానీ ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది.

 ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన టీమిండియా ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ను గురించి టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ప్రదర్శన పై ఇక ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఒక్క ఓటమి లేకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలవడం ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడు జరగలేదు అంటూ పొగడ్తలతో టీమిండియాను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహించిన ప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించిన బుమ్రా భారత జట్టు వరల్డ్ కప్ లో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అదరగొట్టిన బుమ్రాపై టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా బౌలర్ బుమ్రా కోహినూరు వజ్రం కంటే విలువైనవాడు అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యలు ఇచ్చాడు. ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మట్లలో తిరుగులేని బౌలర్ బుమ్రాను ఎంత ఒత్తిడిలోనైనా రాణించగలడం.. అతని బలం ఏ ఓవర్ లో వచ్చిన మ్యాచ్ గతిని మార్చగలడు. ఇక అతని ప్రతిభ గురించి వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అంటూ దినేష్ కార్తీక్ బుమ్రా పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: