ఇది కదా డార్లింగ్ క్రేజ్: కల్కి చూడడానికి ఏకంగా అక్కడి నుండి వచ్చిన ఫాన్స్..!?

Anilkumar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. ఇక గత ఏడాది సినిమాతో బిగ్గెస్ట్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి... ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌కే

 ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ చేసిన కల్కి తాజాగా మరో మైలురాయిని దాటింది.  ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన ఆమెతోపాటు మరో హీరోయిన్గా దిశా పటాని కనిపించింది. వీరితో పాటు భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమా తో మరో పాన్ ఇండియా హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఎడి సినిమా చూసేందుకు రీసెంట్ గా జపాన్ నుంచి

 ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారును, ప్రభాస్ కటౌట్ తో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకున్నారు. ఈ ఫొటోస్ ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఇన్ స్టా అక్కౌంట్ ద్వారా షేర్ చేసింది. కల్కి 2898ఎడి సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖిస్తోంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898ఎడి సినిమాతో తన థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీ దక్కించుకున్నారు ప్రభాస్. రెబెల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను పోట్రే చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం…ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: